
కేంద్రమంత్రి బండిసంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ 317 జీవో గురించి ప్రస్తావించడం కరెక్ట్ కాదన్నారు. బండి సంజయ్ ప్రతీది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామన్నారు. స్థానికత్వం అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్థానత్వ అంశంపై కేంద్ర ప్రబుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు నివేదిక ఇవ్వబోతున్నామన్నారు. కాంగ్రెస్ పై విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేశారు పొన్నం. కాంగ్రెస్ అంటేనే ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రభుత్వం అని అన్నారు.
నిరుద్యోగుల సమస్యలు, 317 జీవోపైన ఇప్పటికే మంత్రి దామోదర రాజనర్సింహ,శ్రీధర్ బాబు సమావేశాలు నిర్వహించారని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదేనన్నారు.ఇలాంటి సున్నితమైన అంశాలు రాజకీయాలకు ఉపయోగించడం కరెక్ట్ కాదని సూచించారు పొన్నం.
బండి సంజయ్ ఏమన్నారంటే..
317 జీవోతో ఉపాధ్యాయుల ఉసురు తీసింది. గ్రూప్ నియామకాల్లో 1:50 నిష్పత్తిలో ఎంపిక చేసి అభ్యర్థులకు అన్యాయం చేసింది. నోటిఫికేషన్ల ఇవ్వక
నిరుద్యోగుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంది. ప్రమోషన్లు, ట్రాన్సఫర్లు, డీఏలు, పదోన్నతులు వంటి ప్రతీ అంశంలోనూ నమ్మించి నట్టేటా ముంచింది కాంగ్రెస్. మోసపరులకు ఓటుతో బుద్ధి చెబుదాం మార్గదర్శకులకు ఓటుతో పట్టం కడుదామని అన్నారు.