ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు హరీశ్ రావు షో: మంత్రి పొన్నం

ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు హరీశ్ రావు షో: మంత్రి పొన్నం
  • కాళేశ్వరం కుంగిపోయి ఒక్క చుక్క కూడా వాడుకోలేని పరిస్థితి
  • కేసీఆర్ నిర్వాకం​వల్లే ప్రాజెక్ట్​పనికిరాకుండా పోయింది
  • బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యాన్ని మేనేజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నరు
  • ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు షో చేస్తున్నరు
  • హరీశ్ హార్డ్‌ వర్కర్‌.. మాకు సలహాలు ఇవ్వొచ్చు
  • అబద్ధాలతో ప్రజలను మేనేజ్‌ చేస్తామంటే కుదరదు
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌: మల్లన్న సాగర్‌కు వచ్చిన వాటర్ ఎల్లంపల్లి నీళ్లే అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టంచేశారు. దీనికి మాజీ మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్‌ చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్వాకం​వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్​పనికిరాకుండా పోయిందన్నారు. గాంధీ భవన్​లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ  ‘2009–--14లో నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది.  

వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తానని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే తెలంగాణ వ్యతిరేకివి నువ్వు ఎలా వస్తావ్.. వస్తే హెలికాప్టర్ పేల్చేస్తా అని నేను హెచ్చరించా.  ప్రాణహిత ప్రాజెక్ట్ లో ఎల్లంపల్లి, నందిమేడారం, లక్ష్మీ బ్యారేజీ, మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లు ఉన్నాయి. రీ డిజైన్ చేసిన ఇంజినీర్ కానీ ఇంజినీర్ కేసీఆర్ కట్టుకథలు అల్లారు. మిడ్ మానే రు నుంచి వరంగల్ వరకు రిజర్వాయర్లు నింపింది ఎల్లంపల్లి నుంచే. హరీశ్ రావు హార్డ్‌ వర్కర్‌, ఆయనకు కష్టపడేతత్వం ఉంది.

ALSO READ : సీఎం రేవంత్ అధ్యక్షతన CLP భేటీ.. కీలక అంశాలపై డిస్కస్

 అబద్ధాలతో ప్రజలను మేనేజ్‌ చేస్తామంటే కుదరదు. రాజకీయం చేయడం మా ప్రాధాన్యత కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడమే మాకు ముఖ్యం. హరీశ్ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. ఇరిగేషన్‌ మాజీ మంత్రిగా హరీశ్.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు. కేసీఆర్‌ పాలనలోనే కాళేశ్వరం కుంగిపోయి నిష్ప్రయోజనంగా మారింది. ఒక్క చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు మల్లన్న సాగర్ వద్ద షో చేస్తున్నరు’ అని మండిపడ్డారు.