పదేండ్లలో ఒక్క రేషన్ కార్డూ ఇయ్యలే : పొన్నం ప్రభాకర్

పదేండ్లలో ఒక్క రేషన్ కార్డూ ఇయ్యలే : పొన్నం ప్రభాకర్
  • ఇప్పుడు మాపై విమర్శలా?

బడంగ్ పేట/దిల్ షుఖ్ నగర్/ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫోర్త్ సిటీలో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్, బీసీ వెల్ఫేర్​కు సంబంధించిన అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జల్ పల్లి, బడంగ్ పేట, మీర్ పేట మున్సిపాలిటీ, ఆర్కే పురంతోపాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ఇన్​చార్జీ, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కలిసి శనివారం ఆయన శంకుస్థాపనలు చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాపాలనలో అర్హులందరికీ రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు. 

ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి 

ముషీరాబాద్: రాష్ట్రంలో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో మంత్రికి ఆయన నివాసంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం రూపొందించిన 2025 క్యాలెండర్​ను ఆవిష్కరించారు.