కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోకస్ చేశారని, అవినీతికి పాల్పడిన ఎంతటివారైన చర్యలు తప్పవని కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అన్నారు. బుధవారం డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు. బల్దియా చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే విచారణ జరుగుతుందన్నారు. విచారణకు మేయర్ ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొంత మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకే మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ పై సమీక్ష నిర్వహించారన్నారు. మీడియా సమావేశంలో కార్పొరేటర్లు కాశిట్టి లావణ్య, గంట కల్యాణి, ఆకుల నర్మద, ఆకుల లత, చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, మెండి శ్రీలత, పిట్టల వినోద, సరిల్ల ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.