
కొమురవెల్లి, వెలుగు:ఈనెల 7వ తేదీన జరిగే మల్లన్న కల్యాణానికి హాజరుకావాలని కొమురవెల్లి ఆలయ నిర్వాహకులు సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, ప్రధానార్చకులు మల్లికార్జున్ పాల్గొన్నారు.