హైదరాబాద్: బీజేపీ రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాషాయ పార్టీకి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమవుతారని అన్నారు. గాంధీభవన్లో కురుమ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి పొన్నం మాట్లాడారు. 'కాషాయ పార్టీ రాముణ్ణి నమ్ముకొని రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ కోట్ల మంది మంగళ సూత్రాలను నిలబెట్టింది. 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ చూస్తుంది. వాటిని ముట్టుకుంటే మాడి మసైపోతరని బీజేపీపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ హెచ్చరికలతో బీజేపీ నేతలు నిన్నటి నుంచి రిజర్వేషన్లు తీయం అని అంటున్నరు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కావాలి.
దేశ సంపదను మోదీ.. అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తుండు. బీజేపీ ప్రభుత్వం కుల గణనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ కమిషన్ తెచ్చారు. హైదరాబాద్ యూటీ కాకుండా కాంగ్రెస్ కాపాడుతుంది. కురుమ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఎన్నికల కోడ్ ముగియగా నే ఏర్పాటు చేస్తం' అని పొన్నం తెలిపారు.