పదిహేనేండ్లు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయండి : మంత్రి పొన్నం ప్రభాకర్

  • ప్రతి స్కూల్ లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలి: మంత్రి పొన్నం
  •  రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: పదిహేనేండ్లు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. రోడ్ సేఫ్టీపై స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి స్కూల్ లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. శనివారం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో పొన్నం సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

రవాణా శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లు పూర్తి చేయాలని, అందుకు సంబంధించి నివేదిక తయారు చేయాలని సూచించారు.  ప్రజాపాలనలో రవాణా శాఖ అమలు చేస్తున్న విప్లవాత్మకమైన సంస్కరణలపై రాష్ట్ర ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి  అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలపై భారం పడకుండా ఆదాయ మార్గాల పెంపుపై దృష్టి సారించాలన్నారు.  

ఫ్రీ జర్నీ స్కీమ్​లో 111 కోట్ల జీరో టికెట్లు జారీ

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ఆర్టీసీ సమర్థవంతంగా అమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నదని పొన్నం పేర్కొన్నారు. సిబ్బందికి మంత్రి అభినందన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెలిపారు. ఈ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కంలో భాగంగా ఈ నెల 20 వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని..  రూ.3,747 కోట్లు మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆదా చేసుకున్నార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. రవాణా శాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త ఏడాది డిసెంబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ నుంచి ఇప్పటివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కారంతో 1,389 కొత్త బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్సుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆర్టీసీ కొనుగోలు చేసింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తెలిపారు.