కుల గణన సర్వేకు అంతా సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

కుల గణన సర్వేకు అంతా సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : కులగణన సర్వేకు అంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  సీఎం సూచనలతో అఖిల పక్షం ఏర్పాటు చేస్తామన్నారు. కులగణన సర్వేల్లో కాంగ్రెస్ నేతలు అధికారులకు సహకరించాలని కోరారు. పార్టీల వారీగా బాధ్యులను నియమిస్తామన్నారు. కులగణనకు సంబంధించిన అంశాలన్నీ  ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. 

బుధవారం(అక్టోబర్ 30) ఉదయం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ మషేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కీలక సమావేశ జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఇంచార్ దీపదాస్ మున్సీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కుల గణనపై నేతల అభిప్రయాలను తీసుకు న్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణనకు  సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.