కుల గణనతో కొత్త శకం మొదలైంది : మంత్రి పొన్నం ప్రభాకర్

కుల గణనతో కొత్త శకం మొదలైంది : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో కుల గణన అనేది దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం అని.. ఈ లెక్కలతో బలహీనవర్గాలకు కొత్త శకం మొదలైంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీలో కుల గణన సర్వే రిపోర్ట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. సర్వే వివరాలను వెల్లడిస్తూ.. ఇప్పటి వరకు కుల గణననే జరగనప్పుడు.. ఆయా కులాల సంఖ్య తగ్గింది అని.. పెరిగింది అని ఎలా చెబుతారని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన మాటల్లోని ప్రధానమైన అంశాలు ఇలా..

  • ప్రభుత్వ ఉద్యోగులు లక్ష మందితో సమగ్రంగా సర్వే చేశాం
  • 1931 నుంచి బ>లహీనవర్గాల సమాచారం లేదు.. ఇప్పుడు కొత్త సర్వేతో సమగ్ర సమాచారం వచ్చింది
  • కులగణనకు సహకరించిన అందరికీ ధన్యవాదములు
  • సంఘాలు, మేధావులు 
  • దేశవ్యాప్తంగా ఇది చారిత్రాత్మకం.. తెలంగాణ ప్రభుత్వానికే కాదు.. ప్రాతినిధ్యం వహించిన అందరూ స్వాగతించాలి.
  • కుల గణన లెక్కలతోనే భవిష్యత్ లో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతుంది.
  • తెలంగాణ రాష్ట్రంలో బలహీనవర్గాలకు ఈ రోజు నుంచి కొత్త శకం మొదలైంది.
  • భావితరాలకు న్యాయం జరిగే విధంగా ఈ సర్వే చేయటం జరిగింది. 
  • ఈ దిశగానే ఇక నుంచి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
  • ఇప్పటి వరకు లెక్కనే లేదు.. అలాంటప్పుడు బీసీల సంఖ్య తగ్గింది అని ఎలా చెబుతారు..?
  • స్వచ్చంధ సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు తీసుకోవటం జరిగింది.
  • బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే చేయటం జరిగింది.
  • బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే సర్వే చేశాం.. ఇంకా మెరుగ్గా చేయాలంటే సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం.. అంతేకానీ రాజకీయం చేయటం మంచిది కాదు.