సిద్దిపేట: ధాన్యంకొనుగోలులో రైసు మిల్లర్లతో ఎలాంటి సమస్య లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్ది పేట జిల్లా కొండపాక మండలం దుద్దేడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శిం చిన మంత్రి పొన్నం.. రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులున్నా రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతోపాటు అదనంగా 500 బోనస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందన్నారు. 500 బోనస్ విషయంలో ప్రతిపక్ష నేతలు అనవసర రాద్దాంతం చేయకుండా సమస్యలుంటే సహకరించాలన్నారు.
జిల్లాకో సీనయిర్ అధికారిని నియమించి ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు మంత్రి పొన్న ప్రభాకర్. రైసు మిల్లర్ల విషయంలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. 20 మంది రైసు మిల్లర్లు డీఫాల్టర్లు ఉన్నారు 101 మంది రైసు మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చి ధాన్యం కొనుగోలులో పాల్గొంటున్నారని చెప్పారు.