హైదరాబాద్: చాలా కాలంగా చేపమందును ప్రజలు విశ్వాసంతో వేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 150 ఏళ్లుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణి చేస్తున్నారు.
ఆస్తమా, శ్వాస సంబంధ రోగులు ఈ చేప ప్రసాదాన్ని వేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాలతోపాటు పలు దేశాలనుంచి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందరన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.