తెలంగాణ పోరాటానికి, త్యాగానికి గుర్తుగా మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొన్నం మాట్లాడుతూ.. ఐలమ్మ త్యాగానికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి ఆమె పేరును పెట్టిందన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చాకలి ఐలమ్మ త్యాగాన్ని గుర్తించనివారు.. ఇప్పుడు నిసనరలు తెలుపుతున్నారని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ బీసీలను పట్టించుకోలేన్నారు. కులగణనకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Also Read :- పవన్ కు మరో కౌంటర్
చాకలి ఐలమ్మ చరిత్రను పుస్తకరూపంలోకి తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించామన్నారు. గత ప్రభుత్వం ఖజానాఖాళీ చేసి వెళ్లిపోయిందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.