కార్ రేసింగ్ కేసు విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరాం: మంత్రి పొన్నం

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ తప్పును ఒప్పుకోవాలని  రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఖైరతాబాద్ లో నిర్వహించిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లి అమృత్ పథకం మీద ఫిర్యాదు చేస్తామని కేటీఆర్  చెబుతున్నారన్నారు. కార్ రేసింగ్ కేసు విచారణ కోసం ఇటీవలే గవర్నర్ అనుమతి కోరామని చెప్పారు. తాము ఇంకా ఎవరినీ జైల్లో పెడతామని చెప్పలేదని తెలిపారు. కానీ అమృత్లో అవినీతి జరిగిందని కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు కేటీఆర్ చెబుతున్నారని అన్నారు.

కానీ ఈ సాకుతో బీజేపీ వద్ద మోకరిల్లేందుకు వెళ్తున్నారని వివరించారు. కేటీఆర్ కార్ రేసింగ్ కేసులో విచారణకు సిద్ధమై సహకరించాలని అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీదే అరోపణలు వస్తున్నాయని అన్నారు. స్వయంగా ఆయనే తాను కార్ రేసింగ్ కు డబ్బులు ఇచ్చినట్టు చెప్పారని తెలిపారు.  కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలని అన్నారు.

ALSO READ | మీ బంధువులు, స్నేహితులకు చెప్పండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు