-
బండి , కేటీఆర్ తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉంది
-
ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు
-
కులగణన పై రెండు రోజుల్లో నిర్ణయం
-
మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో తాము ధర్మం తప్పలేదన్నారు. డిసెంబర్ 3 వరకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే తమకు లేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటే..నిలబెట్టడానికి వారు వస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే ఈ చేరికలు అని ఆయన స్పష్టం చేశారు. కుల గణన పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.