సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి జిరాక్స్లు అవసరం లేదు: పొన్నం

 సమగ్ర కుటుంబ సర్వేకు  ఎలాంటి పత్రాలు కానీ.. జిరాక్సులు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు మంత్రి పొన్న ప్రభాకర్.  ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మే. తెలంగాణ వ్యాప్తంగా  ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు పొన్నం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని చెప్పారు.  మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారని తెలిపారు.  ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వివరాలు సేకరిస్తారని తెలిపారు పొన్నం.  ఈ సర్వే కు పబ్లిక్ సహకరించాలని తెలిపారు.

Also Read : తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే షురూ

 తెలంగాణ వ్యాప్తంగా  కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని చెప్పారు పొన్నం.  సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లు నియమించామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉండగా 19 వేలకు పైగా ఎన్యుమరేటర్లు నియమించామన్నారు. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్ లో న్యాయం జరిగేలా చేస్తామన్నారు పొన్నం.  కొందరు ఈ సర్వే ను రాజకీయం చేస్తున్నారని..వారి మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు . సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిపక్షాలు తనను అడగాలన్నారు.  ప్రజల సహకారం ఉంటేనే సర్వే సక్సెస్ అవుతుందన్నారు పొన్నం.  అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేశామన్నారు. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని చెప్పారు పొన్నం.