కాంగ్రెస్ అంటేనే... జనం కోసం పనిచేసే పార్టీ: మంత్రి పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ అంటేనే... జనం కోసం పనిచేసే పార్టీ: మంత్రి పొన్నం ప్రభాకర్

రాబోయే వంద రోజుల్లో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పక్కాగా  అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.  డిసెంబర్ 11వ తేదీ సోమవారం సిద్దిపేట పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గత ప్రభుత్వం పాలన నచ్చకే..  ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. 

ఇప్పటిదాకా బస్సులు లేని గ్రామాలకు కూడా బస్సులు నడిచే విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు. మొదట ప్రజల సమస్యలను పరిష్కారం చేద్దామన్నారు. విద్యుత్ శాఖలో రూ.85 వేల కోట్ల అప్పు ఉంది.. రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖపై శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పారు.  ప్రజా సమస్యలపై గత ప్రభుత్వంలో పాలకులను, అధికారులను కలిసే పరిస్థితి లేదని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. కానీ, మా ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించే సమయం ఇవ్వండని అన్నారు.

కాంగ్రెస్ అంటేనే జనం జనం కోసం పనిచేసే పార్టీ.. ప్రజా భవన్ కు ఇప్పుడు అందరూ వచ్చి వాళ్ళ సమస్య లను చెప్పుకోవచ్చన్నారు. ఇప్పటివరకుకొంతమంది బీర్ఎస్ నాయకులు కూడా ప్రజా భవన్ ను చూడలేదని.. వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చి త్వరలోనే అన్ని  పథకాలు అమలు చేస్తామని చెప్పారు.  ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని, ఆర్టీసీ ఆస్తులను కపడుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.