మహాసముద్రం గండిని పరిశీలించిన మంత్రి 

మహాసముద్రం గండిని పరిశీలించిన మంత్రి 

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ మండలంలోని మహాసముద్రం గండిని ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. టూరిజం కారిడార్ లో భాగంగా మహాసముద్రం గండి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో త్వరలో రూ,10 కోట్లతో  ప్రత్యేక యాక్షన్ ప్లాన్ చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి వెంట లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య ఉన్నారు.

గ్రూప్2 ర్యాంకర్ కు మంత్రి సన్మానం

హుస్నాబాద్ కు చెందిన ఐలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్ 2 ఫలితాల్లో 103 వ ర్యాంక్ సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తంచేశారు. క్యాంప్ ఆఫీస్ లో మణికంఠేశ్వర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు