కోహెడ(హుస్నాబాద్)వెలుగు : గౌరవెల్లి నుంచి వచ్చే కాలువల నిర్మాణం కోసం చేపట్టే భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కాల్వల డిజైనింగ్ ఇంజనీర్ల సూచనల ద్వారానే అలైన్మెంట్జరుగుతుందన్నారు. త్వరలోనే నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పారు. పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. చౌటపల్లిలో స్థలం కూడా చూశామని పేర్కొన్నారు.
కాలుష్య పరిశ్రమలు కాకుండా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. విదేశాలకు వెళ్లి జాబ్ చేసుకునే వారికి హుస్నాబాద్‌లో టాంకాం కంపనీ ద్వారా త్వరలో క్యాంపు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్‌లో సెట్విన్ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని మహిళలు, యువత సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్ర్టిక్ వాహనాలపై టాక్స్ లేకుండా చేశామని మొన్నటి వరకు రోజుకు 5 రిజిస్ట్రేషన్ కూడా అయ్యేవి కాదని ఈవీ పాలసీ వచ్చిన మొదటి రోజే 113 వాహనాలు రిజిస్ర్టేషన్అయ్యాయని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు రవీందర్,సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, సహకార అభివృద్ది సంస్థ చైర్మన్మోహన్,సెట్విన్ ఎండీ వేణుగోపాల్, అడిషనల్ కలెక్టర్అబ్దుల్హమీద్, మున్సిపల్చైర్పర్సన్రజిత, గ్రంథాలయ చైర్మన్లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్శివ్వయ్య, ఆర్డీవో రామ్మూర్తి పాల్గొన్నారు.