హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్‌ను సుందర ప్రదేశంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. బుధవారం రాత్రి ఆయన హుస్నాబాద్‌లోని గాంధీ జంక్షన్బ్యూటిఫికేషన్పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు ఎల్లమ్మచెరువు వద్ద రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన శుద్ధీకరణ ప్లాంటును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో మంచి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రియదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మచెరువు వద్ద ఎకరం స్థలంలో నిర్మించిన మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటుతో అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఇక్కడ ఉద్యానవనాలను ఏర్పాటు చేసి టూరిజం స్పాట్‌గా మార్చుతామన్నారు. పట్టణంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, రోడ్లను సుందరీకరణ చేస్తామన్నారు.
అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి, ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కమిషనర్ మల్లికార్జున్, టీపీసీసీ నెంబర్ లింగమూర్తి, కౌన్సిలర్ పద్మ, ప్రాజెక్టు ఆఫీసర్ రవికుమార్ పాల్గొన్నారు