గత పదేళ్లలో పాలకులు ఒక్క ఆర్టీసీ బస్సు కొనలేదని.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ ఈడీని నియమించి ఆర్టీసీ ఉనికికే ప్రమాదం తెచ్చే కుట్ర చేశారన్నారు.
ఇప్పటి వరకు ఆర్టీసీలో 94 కోట్ల మంది మహిళలు.. 3వేల 500 కోట్ల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారన్నారు. నిజామాబాద్ లో 67 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామన్న మంత్రి.. 13 బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. నిజామాబాద్ బస్ స్టాప్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ALSO READ | రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది : ఏపీ మంత్రి పయ్యావుల