కోహెడ,వెలుగు: ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్స్కూల్నిర్మాణాన్ని వచ్చే అకాడమిక్ ఇయర్వరకు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని తంగళ్లపల్లిలో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కూల్నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధన్యం ఇస్తున్నామన్నారు. రాష్ర్టంలో రూ.1100 కోట్లతో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామన్నారు. గురుకులాల్లో పెండింగ్‌లో ఉన్న మెస్‌చార్జీలు, అద్దె బకాయిలు చెల్లించామని, 19 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల మంది టీచర్లకు బదిలీలు చేపట్టామని తెలిపారు.
డీఎస్సీ ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. సముద్రాలలో ఇన్నోవేషన్ పార్కు, బస్వాపూర్‌లో కృషి విజ్ఞాన కేంద్రాలకు త్వరలో భూమి పూజ చేస్తామన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో రాంమూర్తి, గ్రంథాలయ చైర్మన్లింగమూర్తి, మండల అధ్యక్షుడు ధర్మయ్య, సుధాకర్, శంకర్, జయరాజ్, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, మల్లారెడ్డి, శ్రీకాంత్, రవి, శ్రీధర్, నారాయణ పాల్గొన్నారు.