హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రోటోకాల్ పాటించడలేదంటూ మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. భక్తుల తోపులాటలో పొన్నం, విజయలక్ష్మికి గాయాలయ్యాయి. దీంతో అధికారుల తీరుపై అలిగిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి టెంపుల్ బయటే కూర్చున్నారు .
కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు పొన్నం. కళ్యాణానికి ముందు రోడ్డు డివైడర్ పై కూర్చున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పినా మంత్రి వినలేదని తెలుస్తోంది.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. 11 గంటల 34 నిమిషాలకు అమ్మవారి కళ్యాణం జరుగనుంది. అమ్మవారి మూలవిరాట్ కు బంగారు చీరతో అలంకరణ చేశారు. ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నాస్తారు. రంగు రంగు పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం, పరిసరాలను తీర్చిదిద్దారు సిబ్బంది. భక్తుల కోసం క్యూలైన్లు, VIP ఎంట్రీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మూడ్రోజుల కల్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. ఇవాళ కల్యాణ మహోత్సవం జరగనుంది.
జూలై 10 ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యములు, అభిషేకం నిర్వహిస్తారు. దేవతాపూజలు, అగ్రి ప్రతిష్ఠ గణపతిహోమము, మహా శాంతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి ఉంటాయి. అలాగే రాత్రి ఆరు గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరుగనుంది. దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పద్మశ్రీ టవర్స్ నుంచి ఆర్ అండ్ బి వరకు అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్, SRనగర్ కమ్యూనిటీ హాల్, టెంపుల్ వెనుక ప్రాంతాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.