అసెంబ్లీలో బీసీ బిల్లు.. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందాం: మంత్రి పొన్నం

అసెంబ్లీలో బీసీ బిల్లు.. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందాం: మంత్రి పొన్నం

అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేనట్లుగా బీసీ కులగణన నిర్వహించి, బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం అని అన్నారు. బీసీ బిల్లుపై అన్ని పక్షాలు ఏకథాటిగా ముక్తకంఠంతో మద్ధతు ఇవ్వా్ల్సి ఉందని అన్నారు. కేంద్రం కూడా ఈ ఐక్యతను చూసి దిగివస్తుందని ఈ సందర్భంగా అన్నారు. 

Also Raed : చర్లపల్లి టర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు

ఈ అంశంలో పిల్లి శాపనార్థాలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడవద్దని సూచించారు. నిండు నూరేళ్లుండాలే.. పెండ్లి పెటాకులు కావాలే అన్నట్లు మాట్లాడొద్దని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కు సూచించారు. దేశానికి రోల్ మోడల్ కాబోతున్న బిల్లుపై తమిళనాడు స్పూర్తితో ఏకపక్షంగా పోరాడి రిజర్వేషన్లు సాధించుకుందామని అన్నారు. అందుకోసం అన్ని పక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.