- పనులు ప్రారంభించాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ల నిర్మాణం, వాటి విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం బోర్డు సమావేశమైంది. పెద్దపల్లిలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.11.70 కోట్లు, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.6.28 కోట్లు, ములుగులో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.5.11 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కొత్త బస్ స్టేషన్ కోసం రూ.3.75 కోట్లు, ఖమ్మం జిల్లా మధిరలో బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.10 కోట్లుకేటాయించేందుకు అనుమతి ఇచ్చారు. కాగా, బోర్డు అనుమతించిన నూతన డిపోలు, బస్ స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.