హైదరాబాద్, వెలుగు: బోనాల ఉత్సవాలను సక్సెస్చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ లో ఆలయాలకు బోనాల చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. దేవాలయ కమిటీలు అధికారులకు సహకరించాలని కోరారు. బోనాల ఉత్సవాలకు గతేడాది కంటే10 శాతం అదనంగా నిధులు కేటాయించామని చెప్పారు. అవసరం ఉన్నచోట అదనంగా ఇస్తున్నామని తెలిపారు. చెక్కులు పెండింగ్పెట్టొద్దని సూచించారు.
24 నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ పూర్తయిందని, కార్వాన్ఒక్కటి మిగిలి ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం లోపు చెక్కుల పంపిణీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ బాలాజీ, పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని మంత్రి సందర్శించారు.