వారానికి రెండు స్కూళ్లల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్

వారానికి రెండు స్కూళ్లల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్
  • ఆర్టీఏ మెంబర్లకు మంత్రి పొన్నం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లో ప్రతి వారం కనీసం రెండు స్కూళ్లల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లు జరిగేలా చూడాలని ఆర్టీఏ మెంబర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్టీఏ మెంబర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ...ఆర్టీఏ సభ్యులు రవాణా పరంగా అధికారులకు తమ వంతు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. 

రవాణా శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా ఏదైనా పదవి వచ్చినప్పుడు బాధ్యతగా గుర్తించి పని చేయాలన్నారు. రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖ గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జేటీసీలు చంద్ర శేఖర్ గౌడ్, శివ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.