కరీంనగర్: లోక్ సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో ప్రచారంలో భాగంగా గౌడ కులస్థుల సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాజేంద ర్ రావును గెలిపించాలని వారిని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జగపతిరావు కుమారుడైన రాజేందర్ రావును గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలం పెంచాలని కోరారు. బీజేపీ పొరపాటుగా గెలిస్తే ఎస్సీ, ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుందని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి బీజేపీ కుట్రను అడ్డుకోవాలన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరులను గురించి పార్లమెంట్ లో బీజేపీ అవమానకరంగా మాట్లాడితే కనీసం స్పందించని బండి సంజయ్ ని ఎన్నికల్లో ఓడించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉద్యమ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావుకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.