రద్దీకి తగ్గట్లు కొత్త బస్సులు: మంత్రి పొన్నం

రద్దీకి తగ్గట్లు కొత్త బస్సులు: మంత్రి పొన్నం
  •     3,035 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చాం: మంత్రి పొన్నం
  •     ఉత్తమ ఉద్యోగులకు ప్రగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తిచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ర అవార్డులు ప్రదానం

హైదరాబాద్, వెలుగు:  నిరుడు డిసెంబర్​ 9న ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీని అదృష్టలక్ష్మి వరించిందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్​  అన్నారు. శనివారం హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్  బాగ్ లింగంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లిలోని ఆర్టీసీ కళాభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ ఉద్యోగుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తిచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ర అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్​  ముఖ్య అతిథిగా హాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యారు. సంస్థ ఎండీ వీసీ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్జనార్, ఉన్నతాధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిసి ఉత్తమ ఉద్యోగులకు ట్రోఫీలు, ప్రశంసాప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్రాలు, న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దు రివార్డులు అందించి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సిబ్బంది ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నితీరును గుర్తించి అవార్డులతో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్కరించడం మంచి సంప్రదాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. పెరిగిన ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్దీకి అనుగుణంగా కొత్త బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్సుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే 3,035 పోస్టుల భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తీకి ప్రభుత్వం అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి ఇచ్చిందని, నియామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క ప్రక్రియ కొన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగుతోంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ విర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ పొందుతున్న ఉద్యోగుల స్థానంలో పోస్టులను భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తీ చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రభుత్వానికి ప్రతిపాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంపామన్నారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న రూ.200 కోట్ల ఆర్పీఎస్  బాండ్  డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్బుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిబ్బందికి అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేసేలా చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ ఎండీ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్జనార్  మాట్లాడుతూ సిబ్బంది పనితీరు వల్లే రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 63 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామన్నారు. సిబ్బంది కృషి వల్లే ఒక్క రోజులోనే సంస్థకు రూ.32 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.  ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్, తదితర పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించామన్నారు.

రోల్ ఆఫ్ ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు గ్రహీతలు వీరే

డ్రైవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లు - జి.పున్నారెడ్డి, వెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేశ్ (మేడ్చల్), ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఐల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్య (క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీంన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్- 1), వీవీ రెడ్డి (దేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కొండ), కండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్టర్లు వి.శ్రీనివాస్ (గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్వేల్-ప్రజ్ఞాపూర్), కె.రామస్వామి(తొర్రూర్), ఎండీ సుల్తాన్ (వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తి), కె.నర్సింహులు (వేముల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), మెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎం.శ్రీనివాస్ (జగిత్యాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పి.ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి (మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణుగూరు), వెల్డర్  మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాలింగం(నాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్నూల్), హెల్పర్ హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీద్ ఖాన్ (జీడిమెట్ల),  శ్రీప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి కృష్ణ (కంటోన్మెంట్), డిప్యూటీ సూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిటెండెంట్  పీఎస్  నారాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ (వేముల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడ),  టీ3 పి.లింగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్య(గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని), ఏడీసీ ఎన్ఎన్ రావు (హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్-1),  ఏఈ(ఎం) పి.యాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి (మిర్యాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ), లీడింగ్  హ్యాండ్  పి.అశోక్ (జీడిమెట్ల). కాగా.. కరెంట్  షాక్ తో చనిపోయిన వరంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్- 2 డిపోకు చెందిన డ్రైవర్  మెరుగు సంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్   కుటుంబానికి రూ.1.15 కోట్ల విలువైన ప్రమాద బీమా చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రి పొన్నం ప్రభాక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్  అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేశారు.