
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని 220/132 కేవీ సబ్ స్టేషన్ లో విద్యుత్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సబ్ స్టేషన్ ను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, విద్యుత్ శాఖ అధికారులతో కలసి పొన్నం గురువారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు.
గృహ, వాణిజ్య అవసరాలతో పాటు వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, సబ్ స్టేషన్ లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో దాదాపు రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.