అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గ్రామసభల్లో వెల్లడిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై అవసరమైన కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
స్థలాలు లేని వారికి ఏ విధంగా ఇవ్వాలనే అంశాన్ని కూడా చర్చిస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం లను కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పంపిణీ చేస్తామన్నారు. GHMC ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు పొన్నం.
ALSO READ | విద్యార్థి రాజకీయాలు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు:సీఎం రేవంత్రెడ్డి
జనవరి 26 నుంచి రైతుభరోసా,రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతెలిసిందే..తెలంగాణలో వన్ స్టేట్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.