నేరడిగొండ , వెలుగు: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా నేతలు కష్టపడాలని, ఉద్యోగులను అనుసంధానం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయనకు నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆడె గజేందర్, పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను ప్రజలకు అందించేందుకు ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన పేరిట చేపట్టనున్న దరఖాస్తుల స్వీకరణకు గ్రామస్థాయిలోని ప్రతి నాయకుడు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్నేతలు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పసుల చంటి, నియోజకవర్గ నేత ప్రపుల్ చందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు బద్దం పోతారెడ్డి, జాదవ్ కపిల్ తదితరులు పాల్గొన్నారు.