ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా?: పొన్నం ప్రభాకర్

దేశంలో ఎన్నో ప్రభుత్వాలు కూల్చిన  బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  బండి సంజయ్, కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందన్నారు.  బీజేపీలో చేరాలంటే రాజీనామా చేసి  పార్టీలో చేరాలన్న బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు పొన్నం. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ప్రశ్నించారు.  

తమ  ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా? అని  ప్రశ్నించారు మంత్రి  పొన్నం.  తాము  ధర్మం తప్పలేదని.. కుల గణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.  డిసెంబర్ 3 వరకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచన తమకు లేదన్నారు.  ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్ అంటుంటే....నిలబెట్టడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పారు.  ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలని అన్నారు.

ALSO READ ; నా కొడుకునే అరెస్ట్ చేస్తారా?.. మీ అంతు చూస్తానంటూ పోలీసులకు హోంగార్డ్ వార్నింగ్

 ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగుగు ఎమ్మెల్సీలు  కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసింది. మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.