భీమదేవరపల్లి, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో గ్రామం నుంచి అక్కన్నపేట మండలం అంతకపేట వరకు సీఆర్ఐఎఫ్ద్వారా మంజూరైన రూ.25 కోట్లతో డబుల్ రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్మండలాధ్యక్షుడు చిట్టంపెల్లి ఐలయ్య, యూత్ అధ్యక్షుడు జక్కుల అనిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.