సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ ఎక్కువ ఉంటుండంతో టీజీఎస్ఆర్టీసీ 6432 ప్రత్యక బస్సులు నడుపుతోంది. ఈ బస్సులు పండుగకు ఊరికి వెళ్లేందుకు జనవరి 10 నుంచి 12 వరకు.. మళ్లీ తిరిగి వచ్చేందుకు జనవరి 19,20 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి.
అయితే మహాలక్ష్మీ స్కీంలో భాగంగా స్పెషల్ బస్సుల్లోనూ మహిళలు ఫ్రీ జర్నీ చేయొచ్చు. ఈ బస్సులు హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్,కూకట్ పల్లి,ఉప్పల్, అరంఘార్, గచ్చిబౌలి, ఉప్పల్ క్రాస్ రోడ్ల దగ్గర అందుబాటులో ఉంటాయి. వీటిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ALSO READ | ప్రైవేట్ ట్రావెల్స్కు పొన్నం వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని.. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడ ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి మేజర్ బస్ స్టేషన్ దగ్గర ప్రత్యేక అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.