
- బాలంరాయి స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
పద్మారావునగర్/ట్యాంక్ బండ్, వెలుగు: ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గురువారం నల్లగుట్ట బాలంరాయి గవర్నమెంట్స్కూల్లోని ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ను కలెక్టర్ తో కలసి పరిశీలించారు. స్టూడెంట్లతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఆరో తరగతి స్టూడెంట్ల స్కిల్స్టెస్ట్చేశారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీఈఓ రోహిణి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం పాల్గొన్నారు. అలాగే మార్క రాజ్ కుమార్ గౌడ్, గంధసిరి వీరన్న గౌడ్ నేతృత్వంలో గాంధీనగర్ కవాడిగూడలో ఏర్పాటు చేసిన డెక్కన్ చాయ్ సెంటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కంటోన్మెంట్ లో ఆశా ఆఫీసర్స్ కాలనీ నుంచి రైల్వేస్టేషన్ వరకు రూ 1.15 కోట్లతో సీసీ రోడ్డు పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్శంకుస్థాపన చేశారు.