
- గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు
- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- గ్రేటర్ వ్యాప్తంగా సందడిగా విమెన్స్‌డే సెలబ్రేషన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన హైదరాబాద్కలెక్టర్అనుదీప్ దురిశెట్టితో కలిసి ఎంజీబీఎస్‌లో పర్యటించారు. ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
విమెన్స్‌డే విషెస్చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, సిబ్బందిని సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి చెప్పారు. మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీలోకి 600 అద్దె బస్సులు వస్తున్నాయని, మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. తర్వాత ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మహిళా ప్రయాణికులు, ఆర్టీసీ మహిళా ఉద్యోగులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఈడీ రాజశేఖర్, ఆర్ఎం శ్రీలత, సీఆర్ఎం శ్రీనివాస్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
స్టూడెంట్లతో కలిసి మంత్రి, కలెక్టర్ భోజనం
మహిళా దినోత్సవం సందర్భంగా బహుదూర్ పురాలోని ఫలక్‌నుమా సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో స్టూడెంట్లతో మంత్రి పొన్నం ప్రభాకర్కేక్కట్చేయించారు. స్కూల్లో సెమినార్ హాల్ లేదని ప్రిన్సిపాల్మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మంత్రి భోజనం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్, కలెక్టర్అనుదీప్పాల్గొన్నారు.
మహిళలు అంకితభావంతో రాణిస్తున్నరు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రంగం ఏదైనా మహిళలు అంకితభావంతో రాణిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఫైటర్ జెట్లు నడపడంలో, స్పేస్ టెక్నాలజీ రూపకల్పనలో ఆడబిడ్డలు కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగొని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం బర్కత్‌పురాలోని బీజేపీ ఆఫీసులో మహిళా దినోత్సవం నిర్వహించారు. కిషన్ రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొని మహిళలను సత్కరించారు.
డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో మహిళా దినోత్సవం నిర్వహించారు. హైకోర్టు జడ్జి జస్టిస్సురేపల్లి నంద పాల్గొని మాట్లాడారు. ఉస్మాన్ గంజ్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి(బాస్) అనాథాశ్రమంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. బీజేపీ నేత మాధవీలత పాల్గొని ఆశ్రమంలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.
సేవ చేస్తున్న మహిళ సిబ్బందిని సత్కరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ లోయర్‌ట్యాంక్ బండ్ లో జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు చీరలు, స్వీట్లు, పండ్లు అందజేశారు.