కోహెడ(హుస్నాబాద్)వెలుగు: గౌరవెల్లి ముంపు బాధితుల సమస్యలను మార్చి తర్వాత పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాస్తానన్నారు. శనివారం హుస్నాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా ద్వారా రూ.12 వేలు , భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరుచేస్తామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సోలార్, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి కార్యక్రమాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికాంలోకి వచ్చిన తర్వాత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో 330 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్చైర్పర్సన్రజిత, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్‌విండో చైర్మన్శివ్వయ్య, ఏఎంసీ చైర్మెన్లు తిరుపతిరెడ్డి, నిర్మల, వైస్ చైర్మన్లు తిరుపతిరెడ్డి, చందు పాల్గొన్నారు.