అప్జల్ గంజ్  సెంట్రల్ లైబ్రరీ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది: పొన్నం

అప్జల్ గంజ్  సెంట్రల్ లైబ్రరీ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమానికి ,ఉద్యోగ పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశ్రీ డా. ఎస్ ఆర్ రంగనాథన్  133వ జయంతి  వేడుకల్లో పాల్గొన్నారు. రంగనాథన్ స్పూర్తితో ప్రతి మండలం, మున్సిపాలిటీ విద్యా కేంద్రాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.పలువురు గ్రంథాలయ పాలకులకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి.

 80 వేల పుస్తకాలు చదివిన  మాజీ ముఖ్యమంత్రి గ్రంథాలయాలపై దృష్టి  పెడితే   ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు పొన్నం. గ్రంథాలయ ఖాళీ పోస్టులపై లెటర్  ఇస్తేన.. సీఎంతో మాట్లాడి జాబ్ క్యాలండర్ లో పెట్టించేలా చేస్తాననిచెప్పారు.  గ్రంథాలయ సెస్ ద్వారా కచ్చితంగా ఒకటో తారీఖునే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.  గ్రంథాలయ మెయింటనేన్స్  కోసం నిధులు వచ్చేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు.  మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలు మార్చుకునేల నేటి తరానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రంగనాథన్ స్పూర్తితో ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో  గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు  ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారుపొన్నం.