చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తున్నాం : మంత్రి పొన్నం

 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తున్నాం : మంత్రి పొన్నం

చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా..  చెన్నూరు బస్ డిపో కోసం 4 కోట్లు మంజూరు చేశామన్నారు మంత్రి పొన్నం. మొదటి విడతగా కోటి 20 లక్షలు చెల్లించిందన్నారు. కాంపౌండ్ వాల్ , బేస్మెంట్ , గారెజ్ పనులు పూర్తయ్యాయి.. కానీ  ఆర్టీసీకి సంబంధించిన భూమి హై కోర్టు  స్టే ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు .హైకోర్టు స్టే ఎత్తివేసిన తర్వాత డిపో ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు పొన్నం .  

Also Read:-రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో మాటల యుద్ధం..

క్వశ్చన్ అవర్ సందర్భంగా చెన్నూరులో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుపై ప్రశ్నించారు  ఎమ్మెల్యే వివేక్.  చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటు బస్  డిపో చాలా ముఖ్యం..  చెన్నూరుకు 3 రాష్ట్రాల బస్సులు వస్తాయి.. చెన్నూరులో త్వరగా బస్ డిపో పూర్తి చేయాలి. చెన్నూరులో రోడ్లు సరిగా లేవు..  నేను ఎమ్మెల్యే అయ్యాక  పలు రోడ్లను  బాగు చేశా.  చెన్నూరు టూ హైదరాబాద్ ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలి. మంచిర్యాల టూ చెన్నూరు వయా బీమారం బస్సు సర్వీలు ఏర్పాటు చేయాలి. ఆసిఫాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు  మందమర్రి డిపోకు వచ్చి వెళ్లాలి.    చెన్నూరు నియోజకవర్గానికి ఎక్కువ ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఏర్పాటు చేయాలి అని వివేక్ విజ్ఞప్తి చేశారు.