కులగణనతో బీసీల్లో పెనుమార్పులు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కులగణనతో బీసీల్లో పెనుమార్పులు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కరీంనగర్: కులగణనతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ, హైకోర్టు ఉత్తర్వుల మేరకే కులగణన చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థలు, ఇతర రంగాల రిజర్వేషన్లపై ఆలోచన చేస్తున్నామని, డిసెంబర్​లో సర్వే నివేదికను ప్రభుత్వం ముందు ఉంచుతామని తెలిపారు. కులగణనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. బీసీ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుబట్టలేదని.. డెడికేషన్ కమిటీ వేయాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సకల జనుల సర్వేను చేపట్టి కనీసం రిపోర్టును కూడా బయటపెట్టలేదని ఎద్దేవా చేశారు.హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో కులగణన జరుగుతోందని స్పష్టం చేశారు. సర్వే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అయోమయం అక్కర్లేదని అన్నారు. అందరూ సర్వేకు సహకరించాలని పొన్నం పిలుపునిచ్చారు.