ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన సర్వే.. ఇది రీ సర్వే కాదు: మంత్రి పొన్నం

ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన సర్వే.. ఇది రీ సర్వే కాదు: మంత్రి పొన్నం

దేశంలో అన్ని రాష్ట్రాలకు కులగణన సర్వే మార్గ దర్శకంగా  నిలిచిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  గత సర్వేలో వివరాలు ఇవ్వని వారి కోసం  ఫిబ్రవరి 16 నుంచి 28 కులగణన సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఅర్ఎస్ నేతలు చెబుతున్నట్లు  ఇది రీ సర్వే కాదన్నారు.  42 శాతం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్‌ కోసం  ప్రత్యేక అసెంబ్లీ ‌సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ అగ్ర నాయకులు సర్వేలో పాల్గొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు పొన్నం.   బీజేపి వ్యాపారస్తుల పార్టీ.. కులగణన,బీసీ,ఎస్సి రిజర్వేషన్ జరగడం వారికి  ఇష్టం లేదన్నారు.  ప్రజల అకాంక్షలకి అనుగుణంగా తెలంగాణలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికలు సర్వే అయిన తర్వాతనే జరుగుతాయని చెప్పారు. బలహీన వర్గాల మీద‌ చిత్తశుద్ధి ఉంటే శాసనసభ బిల్లును అడ్డుకొవదన్నారు.

 బండిసంజయ్ దేశం మొత్తం బిసి రిజర్వేషన్ అమలు చేసే విధంగా కృషి చేయాలన్నారు.   రాజకీయ విమర్శల కోసమే బీసీ ముస్లీంల మీద బీజేపీ విమర్శలు చేస్తుందని ద్వజమెత్తారు.  ముస్లీం కమ్యూనిటీ లోని పేద ముస్లీంలు చాల రోజుల నుంచి బీసీలలోనే ఉన్నారని చెప్పారు.  సమగ్ర కుటుంబ సర్వేని‌ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు పొన్నం. కవిత తమ పార్టీలోని మూడు పదవులను బీసీలకు  కెటాయించేలా కరీంనగర్ నుంచే  ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పర్యటన మీద దుష్ప్రాచారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.