- వరంగల్ డిక్లరేషన్ అమలు కోసమే కేబినెట్ తీర్మానం
హుస్నాబాద్, వెలుగు : మేము గత పాలకుల లెక్క రైతులను మోసం చేసేటోళ్ల కాదు.. కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే తప్పక అమలయితది.. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నం... రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. ఈ విషయంపై కేబినెట్‌లో తీర్మానం చేశాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపాలిటీపై రివ్యూ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
గత పాలకులు ఒకేసారి రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని, తరువాత విడతల వారీగా అంటూ కూడా మాట తప్పారని విమర్శించారు. కానీ తాము అలా కాదని, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, దీనిపై త్వరలోనే విధివిధానాలు వస్తాయని చెప్పారు. హుస్నాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధిని మోడల్‌గా నిలుపుతానని చెప్పారు. రోడ్లు, డ్రింకింగ్ వ ఆటర్, డ్రైనేజీ, ఎల్లమ్మ చెరువు అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటామని చెప్పారు.