త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేస్తం: మంత్రి పొన్న ప్రభాకర్

  • ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలె : మంత్రి పొన్నం ప్రభాకర్​ 

హైదరాబాద్:ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడుతామని, తర్వలోనే 3035 ఉద్యోగాలను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో టీజీఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతిచక్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగి మరణిస్తే రూ. కోటి బీమా ఇచ్చేలా ఎంవోయూ చేసుకుంటుం దన్నారు. ప్రజలకు ఇబ్బందులు రానివ్వకుండా, ప్రభుత్వం త్వరలోనే నూతన బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.  

ALSO READ | మెట్రో ప్రయాణికుల మహాధర్నా: పెయిడ్ పార్కింగ్ పై వెనక్కి తగ్గిన మెట్రో

ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రజలకు అందించడంలో ఆర్టీసీ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఆర్టీసీకి పూర్వవైభవం వచ్చింద న్నా రు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం పదేళ్లు ఆర్టీసీని పట్టించుకోలేదన్నారు. ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ. ఉద్యోగులు బాధ్యత పనిచేసి, ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలన్నారు.​ అనంత రం ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలను అందజేశారు.