అవసరమైన చోట కొత్త బస్ డిపోలు.. ఉన్న డిపోలను క్లోజ్ చేయం : పొన్నం

  • అవసరమైన చోట కొత్త బస్ డిపోలు
  • ఉన్న డిపోలను క్లోజ్ చేయం
  • ఆర్టీసీ ఆస్తులు కాపాడుతం
  • రవాణాశాఖ మంత్రి పొన్నం

నిజామాబాద్ : ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఇందుకోసం అవసరమైన చోట కొత్త డిపోలను ఏర్పాటు చేస్తామని రవాణాశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇవాళ ఆర్మూర్ బస్టాండ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మనుగడలో ఉన్న బస్సు డిపోలను ఎట్టి పరిస్థితిలో క్లోజ్ చేయబోమని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఆస్తుల లీజు తీరుపై త్వరలో రివ్యూ చేస్తామని, ఆర్టీసీ భూములు ఎక్కడ కబ్జాకు గురైనా గుర్తించి రక్షణ చర్యలు చేపడుతామని చెప్పారు. త్వరలోనే రెండువేల బస్సులు కొనుగోలు చేసి అన్ని డిపోలకు పంపనున్నట్టు పొన్నం చెప్పారు.