రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా రాష్ట్రంలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామని చెప్పారు. చట్టాన్ని కఠినం చేస్తూనే.. రవాణా శాఖ ఆదాయాన్ని పెంచుతామన్నారు.
ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్ లో తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 6916 లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు పొన్నం.
ALSO READ | ఘోరం: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు.. 5 మంది మృతి..