హనుమకొండ: టీజీ పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో వాహనాల నెంబర్ ప్లేట్ పై ఏపీ బదులుగా టీజీ గా మార్చుకున్నాం. జూన్ 2 రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇస్తే గత ప్రభుత్వం టీఎస్ గా మార్చిందన్నారు పొన్నం. శుక్రవారం ( మార్చి 15 ) నుంచి ప్రతి బండి టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
మరోవైపు ప్రమాదాలు జరగకుండా హెవీ వెహికల్స్ డ్రైవర్లకు మరోసారి ఫిట్ నెస్ టెస్టులు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు పొన్నం. ఎలాంటి భారం లేకుండా ఆర్టీసీ నడుస్తోందన్నారు. టీఎస్ ఆర్టీసిని బలోపేతం చేసి..త్వరలో ఉద్యోగ నియామకాలు చేపడతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.