కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది : మంత్రి పొన్నం

నల్లగొండ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే కాలంలో బలహీనవర్గాలకు  మంచి జరగాలన్న ఆలోచనతో కుల గణను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన అన్నారు. 

నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాల ఆవిష్కరించారు. వారితోపాటు బీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళలకు చదువు ఉండకూడదనే మూఢనమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిబాయి పూలే మహిళా చదువు కోసం ఎంతో కృషి చేసిందని ఆమె సేవలను పొన్నం ప్రభాకర్ గౌడ్ కొనియాడారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేలా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

బీసీలు,అణగారిన వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.80 కోట్లతో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లను నిర్మించనుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఎస్ఎల్బీసీ కాలనీలో ఈ హాస్టల్ ను నిర్మించనున్నామని ఆయన తెలిపారు.

ALSO READ | కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ : కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి