అనుమానాలొద్దు.. సమగ్ర సర్వేతో స్కీమ్స్‌లో కోతలుండవు : మంత్రి పొన్నం

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: రాష్ట్రంలో కులాల లెక్క తెలుసుకునేందుకే సమగ్ర కులగణన సర్వే నిర్వ హిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం హుస్నాబాద్​లో సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వే వల్ల సంక్షేమ పథకాలకు కోత ఉండదని చెప్పారు. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. సమాజంలోని  అసమానతలను తొలగించేందుకుసర్వేఉపయోగపడుతుందన్నారు

 రాష్ట్రంలో ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. సర్వేలో అన్ని వర్గాల ప్రజ లు, రాజకీయ పార్టీల నాయకులు భాగస్వాములు కావాలని ఆయన  కోరారు.త్వరలో
 రాష్ట్రంలో త్వరలో యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ యూనివర్సిటీ ఏర్పాటవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. హుస్నాబాద్​లోని మినీ స్టేడియంలో   రాష్ట్ర స్థాయి ఎస్​జీఎఫ్​ హ్యాండ్​బాల్​ అండర్ 14  బాల, బాలికల పోటీల విజేతలకు ఆదివారం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఇందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, స్పోర్ట్స్​ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. హుస్నాబాద్​లో ఎస్​జీఎఫ్​ రాష్ట్ర స్థాయి హ్యాండ్​ బాల్​ క్రీడలను నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. రాబోయే రోజుల్లో క్రీడలకు కాలంలో హుస్నాబాద్​ వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు.