కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మంగళవారం కరీంనగర్ ముస్లిం జేఏసీ నేతలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత స్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో పెండింగ్‌లో మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
చింతకుంటలో నిర్మిస్తున్న మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మైనారిటీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, అంజుమానే తరఖి ఉర్దూ, అంజుమానే ఇస్లామియా కాంప్లెక్స్, మదీనా కాంప్లెక్స్, అబ్దుల్ వహాబ్ ట్రస్ట్ బిల్డింగ్.. తదితర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మైనార్టీ నేతలు మంత్రిని కోరారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, అధికారులు పాల్గొన్నారు.