- రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని తుమ్మేటి సమ్మి రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ అంచెలంచెలుగా పైకి వచ్చారని, కాంగ్రెస్ మంచి నాయకున్ని కోల్పోయిందన్నారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పది సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి జమ్మికుంట డిగ్రీ కళాశాలలో చదువుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ లో కీలక నేతగా పని చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా 2005 నుంచి 2014 వరకు పనిచేశారు.